హైదరాబాద్, వెలుగు: ఇండియాలోనే మొదటిసారిగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రస్ట్స్(రీట్స్) అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్(ఇన్విట్స్) ఇండెక్స్‌ను లాంచ్ చేసినట్టు ఎన్ఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ సబ్సిడరీ ఎన్ఎస్ఈ ఇండెసెస్ ప్రకటించింది. ఎన్ఎస్ఈలో లిస్ట్ అయిన రీట్స్, ఇన్విట్స్పనితీరును ఇది పరిశీలిస్తుంది. ఫ్రీఫ్లోట్ మార్కెట్‌క్యాప్‌ను బట్టి సెక్యూరిటీ విలువ ఆధారపడి ఉంటుంది. ప్రతి సెక్యూరిటీకి 33 శాతం పరిమితి ఉంటుంది. ఈ ఇండెక్స్‌కు 2019, జూలై ఒకటో తేదీని బేస్ డేట్‌గా నిర్ణయించారు. బేస్ వాల్యూ 1000 ఉంటుంది. మూడు నెలలకు ఒకసారి ఇండెక్స్‌ను రివ్యూ చేసి మారుస్తారు. రీట్స్లను రియల్ఎస్టేట్లో, ఇన్విట్స్‌ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు.
