హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ లారస్ ల్యాబ్స్ ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.195 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.20 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే 875 శాతం వృద్ధి నమోదు చేసింది. కంపెనీ ఆదాయం ఏడాది లెక్కన 35శాతం పెరిగి రూ.1,653 కోట్లకు చేరింది.
సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.3,223 కోట్లకు, ఇబిటా రూ.818 కోట్లకు ఎగిసింది. క్యూ2లో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ (సీడీఎంఓ) విభాగం ఆదాయం 53శాతం వృద్ధి చెంది రూ.518 కోట్లకు, జనరిక్స్ సెగ్మెంట్ నుంచి ఆదాయం రూ.1,135 కోట్లకు చేరుకుంది. షేర్‌కు 80పైసలు డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
