- నా తాళిబొట్టు కొట్టేశాడు.. రాజ్‌తరుణ్‌పై లావణ్య మరో ఫిర్యాదు
గండిపేట, వెలుగు: సినీ నటుడు రాజ్‌తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాపై నార్సింగి ఠాణాలో లావణ్య మరో ఫిర్యాదు చేసింది. తన తాళిబొట్టు సహా ఇతర వస్తువులు దొంగలించినట్లు ఆరోపించింది.
జ్యువెలరీ షాపు బిల్లుతో సహా మంగళవారం మధ్యాహ్నం పీఎస్‌కు వచ్చి ఆమె.. నగలు దాచిన బీరువా తాళం రాజ్‌తరుణ్ వద్దే ఉందని చెప్పింది. గోల్డ్‌ను అతనే దొంగలించినట్లు ఆధారాలు ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.