రివ్యూ: హ్యాపీ బర్త్ డే

రివ్యూ: హ్యాపీ బర్త్ డే

రివ్యూ: హ్యాపీ బర్త్ డే
రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాల్
నటీనటులు :  లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్,సత్య, గుండు సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: కాల భైరవ
నిర్మాత: చిరంజీవి (చెర్రీ)
రచన,దర్శకత్వం: రితేష్ రాణా
రిలీజ్ డేట్: జులై 8,2022

మత్తు వదలరా లాంటి డిఫరెంట్ స్టోరీతో హిట్ కొట్టిన రితేష్ రాణా రెండో సినిమా గా ‘‘హ్యాపీ బర్త్ డే’’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సర్రీయల్ వరల్డ్ లో సాగే స్టోరీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడు చూపే ఓ డిఫరెంట్ ప్రపంచంలోని క్యారెక్టర్స్ ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తుంటాయి. స్టోరీ ఒక ఆర్డర్ లో సాగదు. మధ్యలో సిట్యూయేషనల్ కామెడీ. అది వర్కౌట్ అయితే సినిమా హిట్టవుతుంది. లేదంటే జనాలకు పిచ్చెక్కుతుంది. ‘‘హ్యపీ బర్త్ డే’’ లో రెండో కోవకు చెందుతుంది.   

కథేమిటంటే... 
హ్యాపీ బర్త్‌ డే జిండియా అనే సర్రీయల్ వరల్డ్ లో జరిగే కథ. జిన్‌ సిటీలో రిత్విక్ సోధి అనే రక్షణ మంత్రి ఎవరైనా తుపాకీని కలిగి ఉండవచ్చన్న సవరణ బిల్లు ఆమోదిస్తాడు. బిల్లు పాసైన తర్వాత ఆ సిటీలో తుపాకీ బజార్‌ ఏర్పాటు చేస్తారు . అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీని కొనుగోలు చేస్తుంటారు. మరోవైపు రిట్జ్ గ్రాండ్‌లోని  పబ్‌కి వెళ్లిన లావణ్య  త్రిపాఠి ఇబ్బందుల్లో పడుతుంది. క్రిమినల్స్ పబ్ లో డబ్బును దోచుకోవాలని ప్లాన్ వేస్తారు. చివరికి ఏం జరిగింది. పబ్ కు వెళ్లిన లావణ్య అక్కడ ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది. తనకు ఆ డబ్బు కు ఉన్న సంబంధం ఏంటి. రక్షణ మంత్రి వెన్నెల కిషోర్ చివరికి ఏమయ్యాడు అనేది కథ.

నటీనటులు ఎలా చేశారంటే..
లావణ్య త్రిపాఠి తన పాత్ర వరకు బాగా చేసింది. డ్యూయల్ రోల్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో సినిమాకు హెల్ప్ అయ్యాడు. సత్య కూడా తన ఉన్న ప్రతీ సీన్ ను ఎలివేట్ చేసుకున్నాడు. వీళ్లిద్దరూ సినిమాకు మెయిన్ హైలైట్ గా  నిలిచారు. నరేష్ అగస్త్య తన పాత్రకు న్యాయం చేశాడు.  గుండు సుదర్శన్ మంచి కామెడీ పండించాడు. 

ఎలా ఉందంటే... 
రెండో సినిమాను రితేష్ రాణా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎలాగో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తాను.. ఏది చేసినా జనం చూస్తారులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది. మత్తు వదలరాలో స్టోరీ లైన్ బాగుంది. కామెడీ కూడా పండింది. అందుకే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. కానీ ‘‘హ్యాపీ బర్త్ డే’’లో ఏదీ సరిగ్గా వర్కౌట్ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. కాల భైరవ మ్యూజిక్ సినిమా మూడ్ కు తగ్గట్టు బాగుంది. కానీ ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉండాల్సింది. ల్యాగ్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. ఆర్ట్ వర్క్, విఎఫ్ ఎక్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. రితేష్ రాణా రాసిన కామెడీ పంచ్ లు బాగున్నాయి. ఇలాంటి సర్రీయల్ స్టోరీ హాలీవుడ్ లో వర్కవుట్ అయిన జానర్. కానీ ‘‘హ్యాపీ బర్త్ డే’’ మాత్రం తలా తోక లేకుండా ఏది పడితే అది తీసేసి జనాల మీదకు వదిలారు. అసలు స్క్రీన్ మీద ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు.  హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీలోనైనా ఏ జానర్ అయినా కంటెంట్ టేకింగ్ అనేది ముఖ్యం. అది మరిచి ఏదైనా చూస్తారులే అనుకుంటే ఆ సినిమా హ్యాపీ బర్త్ డేలా మారుతుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ లో జరిగే నానా హడావుడికి జనాలు థియేటర్ నుండి పారిపోవడం ఖాయం.