ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నానని.. కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లే: లావణ్య త్రిపాఠి

ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నానని.. కొత్త సినిమాలేవీ ఒప్పుకోవట్లే: లావణ్య త్రిపాఠి

ప్రస్తుతం ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నానని, కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని చెప్పారు లావణ్య త్రిపాఠి. ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని సత్య తెరకెక్కించిన ‘సతీ లీలావతి’ చిత్రంలో దేవ్ మోహన్‌‌తో కలిసి ఆమె నటించారు.  నాగమోహన్ నిర్మాత.  శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను గురించి లావణ్య ఇలా ముచ్చటించారు.  

‘‘ఇందులో నేను డైరెక్టర్ పాత్రలో కనిపిస్తా. చక్కని ఎంటర్‌‌‌‌టైన్మెంట్‌‌తో పాటు కొంత ఎమోషనల్‌‌ టచ్ ఉంటుంది. ముఖ్యంగా కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మెసేజ్‌‌ కూడా ఉన్నప్పటికీ ఏదో క్లాస్‌‌ తీసుకుంటున్నట్టుగా ఉండదు. ఈ కథ విన్నప్పుడు వరుణ్‌‌కి చెప్పా. అప్పటికి  ప్రెగ్నెంట్ అని తెలీదు. షూటింగ్ సమయంలో విషయం తెలిసింది. అలాగని స్క్రిప్ట్‌‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. 

యాక్షన్ సీక్వెన్స్‌‌లో మాత్రం కొన్ని మార్పులు చేశారు. అయినప్పటికీ కొంత ఇబ్బంది అనిపించి షూటింగ్ అంత ఈజీ కాదని అర్థమైంది. టీమ్ ఇచ్చిన సపోర్ట్‌‌తో సాఫీగా పూర్తి చేశా. ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే మాత్రం షూటింగ్‌‌లకు బ్రేక్ ఇస్తాను. ఇందులో చూపించిన భార్యభర్తల రిలేషన్స్‌‌ బయటి ప్రపంచంలో ఉండవు. నాకు రియల్‌‌ లైఫ్‌‌లో వరుణ్ లాంటి మంచి భర్త దొరికారు. ప్రస్తుతం నా భర్త, కొడుకుతో హ్యాపీగా ఉన్నా. వరుణ్‌‌తో కలిసి నటించాలని నాకు కూడా ఉంది. 

ఓ కథ కూడా వచ్చింది. రియల్ లైఫ్‌‌ కపుల్ అయిన మేము స్క్రీన్‌‌పై డిఫరెంట్‌‌గా కనిపించాలి. అలాంటి కథ వస్తే ఆలోచిస్తాం. ఇక కమల్ హాసన్ గారి క్లాసిక్‌‌ మూవీ ‘సతీ లీలావతి’తో దీన్ని పోల్చలేం. కానీ మా సినిమా మాత్రం చాలా ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా, రిఫ్రెషింగ్‌‌గా ఉంటుంది. ప్రస్తుతం కొత్త సినిమాలేవి ఒప్పుకోవడం లేదు, ఫ్యామిలీకి టైమ్ కేటాయించాలి అనుకుంటున్నా. కొడుకుతో టైమ్ సరిపోతోంది’’.