హ్యాపీ బర్త్ డే ట్రైలర్ వచ్చేసింది

హ్యాపీ బర్త్ డే ట్రైలర్ వచ్చేసింది

హీరోయిన్  లావణ్య త్రిపాఠి   ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ హ్యాపీ బర్త్ డే. మత్తు వదలారా ఫేమ్ రితేష్‌ రానా దర్శకత్వంలో  రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై. సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. జులై 8న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ ను  విడుదల చేశారు. దర్శకధీరుడు రాజామౌళి  చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ లాంచ్‌ అయింది.  ట్రైలర్ మొత్తం డిఫరెంట్ కామెడీతో నింపేశారు.  థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకి కాలబైరవ సంగీతం అందించాడు. కమెడియన్లు వెన్నెల కిషోర్, సత్య, నరేష్ అగస్త్య కీలకమైన పాత్రల్లో నటించారు.  ప్రేక్షకులలో సినిమా పైన మంచి అంచనాలున్నాయి.