లా స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ స్కిల్స్పై ఫోకస్ పెట్టాలి..జస్టిస్ బి విజయసేన్ రెడ్డి

లా స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ స్కిల్స్పై ఫోకస్ పెట్టాలి..జస్టిస్ బి విజయసేన్ రెడ్డి
  • అంబేద్కర్ లా కాలేజీలో ముగిసిన లా ఫెస్ట్ 

ముషీరాబాద్, వెలుగు: లా స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి సూచించారు. రోజు కాలేజీకి వెళ్లడమే కాకుండా కోర్టుల్లో జరిగే వాదనలు కూడా వినాలన్నారు. 20 ఏండ్ల కిందటి వరకు న్యాయవాదులు, న్యాయవిద్యకు అంతగా ఆదరణ లేదని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేడు ఆదరణ పెరిగిందన్నారు. 

బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లా కాలేజీలో నాలుగు రోజుల ‘విద్యత 2025’ లా ఫెస్ట్ గురువారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జస్టిస్ విజయసేన్ రెడ్డి, సీహెచ్ పంచాక్షరి, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్, కాలేజీ సెక్రటరీ జి వినోద్, కరస్పాండెంట్ సరోజా వివేక్, జాయింట్ సెక్రటరీ పివి రమణ కుమార్, ప్రియ అయ్యంగార్, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లా స్టూడెంట్స్​ ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి లా ఫెస్టివల్స్ ఎంతో ముఖ్యమన్నారు. ఇలాంటి ఫెస్ట్ వల్ల స్కిల్స్ మరింత పెరుగుతాయన్నారు. చట్టపరమైన విశ్లేషణ, ఆలోచన, నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విష్ణు ప్రియ, డాక్టర్ జి యాదగిరి, ప్రిన్సిపాల్ డాక్టర్ సృజనతో పాటు దేశవ్యాప్తంగా వివిధ లా కాలేజీలకు చెందిన  స్టూడెంట్స్​, న్యాయ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.