
హైదరాబాద్: అమెరికా వెళ్లాలనే ఉత్సాహంతో కొందరు యువకులు ఆన్ లైన్ పరీక్షలో మాస్ కాపీయింగ్ పాల్పడ్డారు. అమెరికా వెళ్లేందుకు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో అర్హత సాధించేందుకు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు.. హయత్ నగర్ వెంకటేశ్వర లాడ్జ్ పై రైడ్స్ చేశారు.
ఆన్ లైన్ ఇంగ్లీష్ పరీక్షలో ఒకరికి బదులు మరొకరితో పరీక్షలు రాయిస్తూ పట్టుబడ్డారు. లాడ్జ్ లో ఉన్న ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేసన్ కు తరలించారు. నిందితుల దగ్గర నుంచి ల్యాప్ టాప్ లు,7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.