
వరంగల్ ఎంజీఎంలో ల్యాబ్ టెక్నిషియన్ ఖుర్షిద్ మరణానికి ప్రభుత్వం, వైద్యాదికారులు భాద్యత వహించాలంటూ మెడికల్ ఉద్యోగ సంఘాల నేతలు అందోళన చేపట్టారు. సుమారు గంటన్నర సేపు ఎంజీఎంలో నిరసన వ్యక్తం చేసారు. కరోనా బారిన పడ్డ పేద రోగులకు పరీక్షలు చేసి ప్రాణాలు కాపాడిన ల్యాబ్ టెక్నిషియన్.. కరోనా బారిన పడి.. వైద్యం అందించాలని కోరితే.. ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. డాక్టర్లు.. ల్యాబ్ టెక్నిషియన్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లనే ఖుర్షిద్ మరణించాడని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖుర్షిధ్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.