వర్సిటీ ఉద్యోగులకు హెల్త్​కార్డులు ఇవ్వాలి

వర్సిటీ ఉద్యోగులకు హెల్త్​కార్డులు ఇవ్వాలి
  • హెల్త్​ మినిస్టర్​కు  ఓయూ ఉద్యోగ సంఘాల వినతి 

సికింద్రాబాద్, వెలుగు: వర్సిటీ ఉద్యోగులకు హెల్త్​ కార్డులు ఇవ్వాలని  ఓయూ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర రాజ నర్సింహ్మను ఆయన చాంబర్​లో  కలిసి   వినతిపత్రం ఇచ్చారు.

  వర్సిటీ ఉద్యోగులకు సీపీఎస్, ఓపీఎస్​ అమలు చేయాలని, దసరా పండుగ కానుకగా    సీపీఎస్​ ప్రకటించాలని, అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేందుకు    ఆదేశాలు జారీ  చేయాలని   విజ్క్షప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఉద్యోగ సంఘాల నాయకులు జ్ఞానేశ్వర్​, ఔటా ఉపాధ్యక్షులు ప్రొఫెసర్​ మల్లేశం, అధ్యాపకులు ప్రొఫెసర్​ మంగు నాయక్​ తదితరులు ఉన్నారు.