
ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో సెక్రటేరియట్ వరకు ర్యాలీని పోలీసులు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్దే అడ్డుకున్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా.. మరో 30 మంది నాయకులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీసులు.
టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర్ రావు సహా.. మరో 25 మంది నాయకులను నారాయణ గూడ స్టేషన్ కు తీసుకెళ్లారు.
పోలీసుల తీరును నాయకులు తప్పుపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరాటం ఆగదన్నారు.