బినామీల పేరుతో కాంట్రాక్టులు చేస్తున్న లీడర్లు

బినామీల పేరుతో కాంట్రాక్టులు చేస్తున్న లీడర్లు
  • ఇదీ పలువురు ప్రజాప్రతినిధుల తీరు
  • బినామీల పేరుతో కాంట్రాక్ట్​ సంస్థలు
  • నియోజకవర్గాల్లో పెద్దపెద్ద పనులన్నీ వాళ్లయే
  • క్వాలిటీ లేకుంటే అడగలేకపోతున్న ఆఫీసర్లు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలంటే ప్రజా సేవకే పరిమితమయ్యేవాళ్లు. ఇప్పుడు చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. భార్యా, పిల్లలు, బంధువులు, అనుచరుల పేర్లతో కన్​స్ట్రక్షన్ ​కంపెనీలు తెరిచి రోడ్లు, బిల్డింగులు సహా మెజారిటీ పనులన్నీ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్​ టెండర్లయితే పక్కాగా వీరికే వస్తున్నాయి. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెండర్లు కూడా  వదలడం లేదు. ఒకవేళ వేరే ఎవరికైనా వస్తే వారికి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారు. పోనీ, పనులేమన్నా సరిగ్గా చేస్తున్నారా అంటే అదీ లేదు. కొన్నిచోట్ల వర్క్స్​ చేయకుండా, మరికొన్ని చోట్ల మధ్యలోనే ఆపేసి ఆఫీసర్లను బెదిరించి బిల్లులు తీసుకుంటున్నారు.  ఎవరైనా వినకపోతే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయిస్తున్నారు. దీంతో తమకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పినట్టే చేస్తున్నారు. 

ఇసుక, సిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌ షాపులు వీళ్లవే.. 
ఏదైనా కన్​స్ట్రక్షన్​ చేయాలంటే ఇసుక, సిమెంట్​, స్టీల్​ ప్రధానం. దీంతో చాలా నియోజకవర్గల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ బంధువులు, కుటుంబసభ్యుల పేర్లతో ఇసుక బిజినెస్ ​చేస్తున్నారు. సిమెంట్​, స్టీల్​ అమ్మే షాపులు నడిపిస్తున్నారు.  లారీలు కొని ఎక్కడికి అవసరమైతే అక్కడికి ఇసుక సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఎవరైనా వర్క్స్​ చేయాల్సి వస్తే తమ దుకాణాల్లోనే సిమెంట్‌‌‌‌‌‌‌‌, స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇతర సామాన్లు కొనాలని ఆర్డర్ ​వేస్తున్నారు. ఒకవేళ వేరే షాపుల్లో కొన్నారా.. వాళ్ల బిల్లులు ఆగినట్టే. హనుమకొండ జిల్లా మాందారిపేటలో ఏర్పాటు చేసిన డాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ ఎమ్మెల్యే భార్య పేరుపై ఉంది. ఇదేకాక ములుగు జిల్లా ఏటూరునాగారంలో కూడా మరో ప్లాంట్ ​ఉంది. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా రోడ్డు పనులు జరిగితే వీరి స్టోన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌క్రషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మెటీరియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాంబర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నుంచి బీటీ తీసుకోవాల్సిందే. ఈ జిల్లాలో దాదాపు రోడ్లతో సహా పనులన్నీ స్థానిక ఎమ్మెల్యేలకు చెందిన కన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలే చేస్తుండడంతో ఏడాది, రెండేండ్లకే గ్రామాల్లో వేసిన రోడ్లు దెబ్బతింటున్నాయి. అలాగే ఓ ఎమ్మెల్యే తన తమ్ముడి పేరుతో మాందారిపేటలో  ‘రోబోసాండ్ ’ బిజినెస్​ చేయిస్తున్నారు. నియోజకవర్గంలో జరిగే రోడ్డు పనులన్నీ ఈయనే చేస్తారు.   

రూ.120 కోట్ల రోడ్డు..అడిగేదెవరు? 
రాష్ట్రంలో ప్రతీ యేటా నేషనల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌హైవేస్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతుంటాయి. ఈ పనులను ఎక్కువగా అధికార పార్టీ ఎంపీలకు చెందిన కన్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలే చేస్తున్నాయి. ప్రతీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టేట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన హయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫీషియల్స్..ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులకు చెందిన కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌చేస్తున్నారు. అధికార పార్టీలోని ఓ ఎంపీకి చెందిన కన్​స్ట్రక్షన్​కంపెనీ వరంగల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌జిల్లా ఆత్మకూరు నుంచి భూపాలపల్లి జిల్లా చెల్పూరు వరకు రూ.120 కోట్లతో 353 సీ నేషనల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌హైవే రోడ్డు వర్క్స్​ చేసింది.  కానీ, పనులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. పనులు చేసే టైంలోనే రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. ఇప్పటికే ఈ రోడ్డుపై యాక్సిడెంట్స్​జరిగి 20 మందికి పైగా చనిపోయారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో టోల్ ​ఏర్పాటు చేస్తే వాహనదారులు తిడతారని నేషనల్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌హైవేస్ ​ఆఫీసర్లు రెండేండ్లుగా టోల్ గేట్​ ​కూడా ఏర్పాటు చేయలేదు.  నిజానికి రాష్ట్ర సర్కారు ఈ కంపెనీని బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్​లో పెట్టాలి. దెబ్బతిన్న ప్రతి చొటా ఆ కంపెనీతోనే రిపేర్లు చేయించాలి. కానీ ఇవేమి జరగడం లేదు. 
    

  • ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి తన సన్నిహితుడి పేరుతో కన్​స్ట్రక్షన్​ కంపెనీ నడుపుతున్నారు. జిల్లాలో దాదాపు అన్ని పనులు ఇదే కంపెనీకి అప్పజెబుతున్నారు.  ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్​ సంస్థ ఓ మెడికల్ కాలేజీ, 2 మినీ ట్యాంక్ బండ్ లు, చెక్ డ్యాములతో పాటు దాదాపు రూ. 1,200 కోట్ల పనులు చేస్తున్నది. 
  • ఉమ్మడి మహ బూబ్​నగర్​ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు ఓ రిజర్వాయర్ పనుల్లో షేర్ ఉందని ఆరోపణలున్నాయి. ఆయన భార్య డైరెక్టర్ గా ఓ పైపుల కంపెనీ కూడా ఉంది. అలాగే మరో యువ ఎమ్మెల్యేకు కన్స్ట్రక్షన్  కంపెనీ ఉంది. ఇంకో ఎమ్మెల్యేను పాలమూరు ఎత్తిపోతల స్కీమ్​లో అండర్ కెనాల్ పనులు ఇస్తామనే అగ్రిమెంట్ తో పార్టీలోకి తీసుకున్నారని అంటున్నారు. ఓ నియోజకవర్గంలో చెక్ డ్యాం పనులన్నింటినీ ఎమ్మెల్యే బినామీ పేర్లతో చేయిస్తున్నాడు. కర్వెన రిజర్వాయర్ నిర్మాణంలోనూ సబ్ కాంట్రాక్ట్​పనులు చేస్తున్నారు. ఈయనకు వందకు పైగా టిప్పర్లు, జేసీబీలు, టిప్పర్, ఇతర మెషీన్లున్నాయి. నియోజకవర్గంలో చేసే బ్రిడ్జీ నిర్మాణ పనులు, ఇతర పనులన్నీ ఈయన కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. గద్వాల జిల్లాలో ఓ ఎమ్మెల్యే బావమరిదికి స్టోన్​క్రషర్ కంపెనీ ఉన్నది. జిల్లాలో కన్స్ట్రక్షన్ పనుల కోసం వీరి ‌‌‌‌‌‌‌‌క్రషర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌నుంచే మెటీరియల్ సరఫరా అవుతోంది.  
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ అనుచరులకు కాంట్రాక్ట్​ పనులు ఇప్పిస్తుంటారు. దీనికోసం కమిషన్​ తీసుకుంటున్నారు. ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే బినామీల పేర ఇసుక ర్యాంప్​లు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి.  
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ మంత్రి, ఆయన భార్య ఓ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఖమ్మంలో బినామీ పేర్లతో గతేడాది కోట్లాది రూపాయల విలువైన సీసీ రోడ్లు, సెంట్రల్ డివైడర్ల నిర్మాణ పనులు ఈ కంపెనీయే దక్కించుకుంది.