సీఈసీని తొలగించాలి.. సర్‎ను నిలిపివేయాలి: లెఫ్ట్ పార్టీల డిమాండ్

సీఈసీని తొలగించాలి.. సర్‎ను నిలిపివేయాలి: లెఫ్ట్ పార్టీల డిమాండ్

న్యూఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి తొలగించాలని ఐదు వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రక్రియను వెంటనే ఆపాలని కోరాయి. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీలోని ఏకే గోపాలన్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య సమావేశమయ్యారు. 

అనంతరం సీపీఐ(ఎం), సీపీఐ, లిబరేషన్, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ, ఫార్వర్డ్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఎస్ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తప్పుగా తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని, ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడాలని వామపక్షాలు కోరాయి. ఓటర్ల జాబితా సవరణ, పేర్ల తొలగింపు తదితర అంశాలపై ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు 10 నెలల్లో కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ‘ది ఇండియన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్’ కథనాన్ని ప్రస్తావించాయి. 

ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని వామపక్షాలు ఆరోపించాయి. ఓటర్ల డేటా నిర్వహణ, కేంద్రీకరణపైనా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, ఈసీ నియామక విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశాయి.  భగత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్ జయంతి రోజు నుంచి గాంధీ జయంతి వరకు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి.