మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. పలువురు విద్యార్థులు అరెస్ట్

మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. పలువురు విద్యార్థులు అరెస్ట్

హైదరాబాద్ లోని  మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.  విద్యారంగంలో  సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు  మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు.  మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి చోచ్చుకెళ్లెందుకు యత్నించిన విద్యార్థులను  పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య  తోపులాట జరిగింది.   పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారంటూ  విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ALSOREAD :కత్తులతో బెదిరించి.. వలస కూలీల నుంచి డబ్బులు వసూలు చేసిండ్రు 

కార్పొరేట్ ,ప్రైవేట్ ఫీజులను నియంత్రించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  బకాయిలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల కాస్మోటిక్ ,మెస్ చార్జీలు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించాలని..ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.