జులై 23న స్కూళ్లు, కాలేజీల బంద్

జులై 23న స్కూళ్లు, కాలేజీల బంద్
  • వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడీఎస్ఓ, ఏఐపీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్​, ఏఐఎస్​బీ) స్కూళ్లు, జూనియర్ కాలేజీల బంద్​కు పిలుపునిచ్చాయి.

 మంగళవారం హిమాయత్ నగర్​లో విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, బంద్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు.