ప్రముఖ వ్యాపారవేత్త, శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ‘ది లెజెండ్’తో హీరోగా మారారు. ‘ఒక కామన్ మేన్ లెజెండ్‌గా ఎలా ఎదిగాడనేది కథతో వచ్చి అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుడుకున్నాడు. ఈ క్రమంలోనే అతని పేరు ముందు లెజెండ్ అని ఫిక్స్ అయిపోయింది. ఇటీవలే లెజెండ్ శరవణన్ ‘లీడర్’ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించారు.
దురై సెంథిల్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో నటించింది. కిక్ శ్యామ్, ఆండ్రియా, అమృత అయ్యర్, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఇవాళ (మే 29న) ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది.
#LegendSaravanan's #LEADER
— OTT Trackers (@OTT_Trackers) May 29, 2026
Now Streaming on PrimeVideo in Tamil, Telugu, Kannada & Malayalam 🍿!!
In Tamil on SimplySouth (Outside India) !!#OTT_Trackers pic.twitter.com/N7bhmVvi81
కథేంటంటే:
శక్తివేల్ (శరవణన్) అనే సింగిల్ ఫాదర్. భార్య మీరా (పాయల్ రాజ్‌పుత్) ఓ ఇన్సిడెంట్ లో చనిపోతుంది. ఇక తన వినికిడి లోపం ఉన్న కూతుర్ని కాపాడుకునేందుకు ప్రమాదకరమైన గ్యాంగ్, పోలీసుల మధ్య చిక్కుకుంటాడు. పోర్టులో అక్రమాలు బయటపెట్టే క్రమంలో అతని గతం, రా ఏజెంట్ బ్యాక్‌గ్రౌండ్, టెర్రరిస్ట్ డెవిల్‌తో ఉన్న పాత వైరం ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి కూతుర్ని రక్షించడానికి శక్తివేల్ చేసిన పోరాటమే కథ.
ఎలా ఉందంటే:
తండ్రి-కూతురు ఎమోషన్‌కు స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను మిక్స్ చేసిన ఈ సినిమా, రొటీన్ కథతో వచ్చినా ఉత్కంఠ పెంచే స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్ ఎలివేషన్స్, క్లైమాక్స్ ట్రైన్ యాక్షన్ ప్రధాన హైలైట్స్. కొన్ని లాజిక్ మిస్‌లు, బలహీనమైన లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ యాక్షన్ అభిమానులకు మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. శరవణన్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, పాయల్ యాక్షన్ తో పాటు గ్లామర్‌తో మెప్పించింది. ఆండ్రియా, శ్యామ్, ప్రభాకర్, లాల్ తమ పాత్రల్లో బలమైన నటన కనబర్చారు.
