
- ఈ టైమ్‌లో చంద్రబాబు అరెస్ట్ బాధాకరం : గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. ఐనప్పటికీ, కేసీఆరే మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ఆరు గ్యారంటీలపై ప్రజల్లో చర్చలేదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పెరుగుతోందన్న భ్రమలో ఆ పార్టీ నాయకులు ఉన్నారన్నారు. చంద్రబాబు సీనియర్ జాతీయ నాయకుడని, ఆయన అరెస్ట్ బాధాకరమని, ఈ టైమ్‌లో కరెక్ట్కాదని పేర్కొన్నారు. శుక్రవారం గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతారని, ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్అని అన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ గతంలో ఢిల్లీలో ఉంటే ఇప్పుడు వయా బెంగళూర్లా మారిందన్నారు. తన కొడుకు అమిత్‌కు టికెట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరలేదని స్పష్టం చేశారు. అవసరాలను బట్టి పార్టీ అవకాశం ఇస్తుందని తెలిపారు. తనకు ఎవరు వ్యతిరేకమో తాను కూడా వాళ్లకే వ్యతిరేకమని గుత్తా పేర్కొన్నారు. ప్రధాని వాడిన భాష, బాడీ లాంగ్వేజ్ ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి అంతంర్గతంగా మాట్లాడుకున్న విషయాలు బయట చెప్పకూడదన్నారు. బీజేపీకి సింగిల్ డిజిట్ దాటదని
బీజేపీలోని వివిధ కమిటీల చైర్మన్లు ఎన్నికల వరకు అందులోనే ఉంటారా అనేది అనుమానమేనని పేర్కొన్నారు. వీరేశం పార్టీ మారడంలో అర్థం ఉందని.. అనిల్ కుమార్ రెడ్డి ఎందుకు వచ్చిండో, ఎందుకు వెళ్లిండో తెలియదన్నారు. నందికంటి శ్రీధర్ అవసరం బీఆర్ఎస్ కి ఉందని తెలిపారు. గవర్నర్‌కు కేంద్రం ఏం చెబితే అదే చేస్తారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నీరసంగా ఉన్నందున ఎవరూ కలవలేకపోతున్నారని తెలిపారు.