సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష

సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష
  •  శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​​

జనగామ, వెలుగు :  సైనికుల సంక్షేమంపై కేంద్రం వివక్ష చూపుతూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్​ బండ ప్రకాశ్​ అన్నారు. ఆదివారం జనగామలోని ఎన్​ఎంఆర్​ గార్డెన్​ లో కర్నల్ మాచర్ల​ భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. వన్​ ర్యాంక్​ వన్​ పెన్షన్​ అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

పుల్వామా దాడి ఘటన కేంద్ర వైఫల్యమన్నారు. అమరులైన సైనికులను రాజకీయ లబ్ధికోసం మోడీ వాడుకుంటున్నారని ఆరోపించారు.  సైనికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి పాటుపడతానన్నారు.  సమావేశంలో ఉషాదయాకర్​ రావు, సైనిక్​ బోర్డ్​ డైరెక్టర్​ కర్నల్​ రమేష్, మాజీ సైనికులు చిర్ర రవీందర్​ రెడ్డి, దరిపెల్లి అరవిందాచార్యులు, సయ్యద్​ యూసఫ్​, కరుణాకర్​ రెడ్డి, వనమాల సోమయ్య  పాల్గొన్నారు.