లెంగ్త్‌‌ ఎప్పటికప్పుడు మారుస్తుంటా

లెంగ్త్‌‌ ఎప్పటికప్పుడు మారుస్తుంటా

న్యూఢిల్లీ : ఇటీవల టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేసర్‌‌ మహమ్మద్‌‌ షమీ హిస్టారికల్​ డేనైట్‌‌ టెస్ట్‌‌కు ముందు తన బౌలింగ్‌‌ టెక్నిక్‌‌ను చెప్పాడు. పిచ్‌‌ ఎలా స్పందిస్తుందో తెలుసుకుని బ్యాట్స్‌‌మన్‌‌కు అంతుచిక్కకుండా బౌలింగ్‌‌ వేసేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపాడు. ఇందుకోసం పరిస్థితికి అనుగుణంగా ఎప్పటికప్పుడు  లెంగ్త్‌‌ను మార్చుకుంటానని స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో షమీ అన్నాడు. ఇదే ఈవెంట్​లో పాల్గొన్న ఇండియా మాజీ కెప్టెన్‌‌ సునీల్‌‌ గావస్కర్‌‌.. యంగ్‌‌ ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాలపై ప్రశంసలు కురిపించాడు. ‘మయాంక్‌‌ టెస్ట్‌‌ క్రికెట్‌‌ను ఎంజాయ్‌‌ చేస్తున్నాడు.

అతనికి తొలి ఏడాది. వచ్చే ఏడాదిలో కూడా ఇలానే రన్స్‌‌ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే వచ్చే సీజన్‌‌ నాటికి మయాంక్‌‌ గురించి కావాల్సినంత డేటా ప్రత్యర్థుల దగ్గర ఉంటుంది. నిజానికి మయాంక్‌‌ బ్యాటింగ్‌‌ చాలా బాగుంటుంది. ఆఫ్‌‌ సైడ్‌‌కు వాలకుండా తనని తాను బ్యాలెన్స్‌‌ చేసుకుంటు బాగా ఆడుతున్నాడు. ఇక, ఫ్రంట్‌‌ఫుట్‌‌, బ్యాక్‌‌ఫుట్‌‌లోను బాగా ఆడుతుండడం అతని కాన్ఫిడెన్స్‌‌ను పెంచుతుంది’ అని గావస్కర్‌‌ అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా బౌలింగ్‌‌ యూనిట్‌‌ అన్ని విభాగాల్లో బలంగా ఉందని మాజీ ఓపెనర్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ చెప్పాడు. తిరుగులేని పేసర్లు, స్పిన్నర్లు ఉండడం వల్లే గత రెండేళ్లలో టీమిండియా చాలాసార్లు ప్రత్యర్థిని ఆలౌట్‌‌ చేసిందన్నాడు.