లియో కలెక్షన్స్ స్కామ్.. అంతా ఉత్తదే.. లేనిపోని హంగామా

లియో కలెక్షన్స్ స్కామ్.. అంతా ఉత్తదే.. లేనిపోని హంగామా

తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Thalapathy Vijay) హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో(Leo). టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఆడియన్స్ నుండి ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ రావడంతో రికార్డ్ కెలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా. విడుదలైన నాలుగురోజుల్లోనే  రూ.400 కోట్లు కొల్లగొట్టి విజయ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. 

అయితే ఇదంతా మేకర్స్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం తీసుకున్నాది కానీ.. నిజానికి ఈ సినిమాకు ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు లియో కలెక్షన్స్ స్కామ్ అనే హ్యాష్ టాగ్ కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. లియో రియల్ కలెక్షన్ నెంబర్స్ మార్చేసి.. ఎక్కువ చెప్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి యూఎస్ బాక్సాఫీస్ నుండి వచ్చే  లెక్కలు పర్ఫెక్ట్ గా ఉంటాయని టాక్ కానీ.. లియో మేకర్స్ యుఎస్ ట్రేడ్ వర్గాలను కూడా మేనేజ్ చేశారని, ఫేక్ బుకింగ్స్ చూపించి సినిమాకు లేని హైప్ ను క్రియేట్ చేశారని, ఇందుకోసం టీమ్ భారీగా ఖర్చు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోసిల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కామెంట్స్ పై లియో మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.