చిరుత కలకలం..రోడ్డు దాటుతూ

చిరుత కలకలం..రోడ్డు దాటుతూ

తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. కరోనా వైరస్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు పూర్తిగా తగ్గిపోయారు. దీంతో తిరుమలలో జనసంచారం లేకపోవడంతో వన్యమృగాలు కొండపైకి వచ్చి సేదతీరుతున్నాయి. తాజాగా రాత్రి తిరుమల అవుటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న గ్యాస్ గూడౌన్ వెనుక నుంచి ఓ చిరుత రోడ్డు దాటింది. చిరుత రోడ్డు దాటిన దృశ్యాలు సీసీ టీవీ పుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.