
బలరాంపూర్ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బాలు గ్రామంలోకి ప్రవేశించింది. రుక్మిణి అనే 8 ఏళ్ల బాలికను చిరుత అడవిలోకి ఈడ్చుకెళ్లి ప్రాణాలు తీసింది. శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం కోసం హస్పిటల్ కి తరలించామని డివిజనల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ కే మిట్టల్ తెలిపారు. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించినట్లు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలు వాడుతున్నామని, త్వరలో దాన్ని పట్టుకుంటామని చెప్పారు. గ్రామస్థులు ఎవరూ తమ పిల్లలను ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు.