రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత కలకలం సృష్టించింది. పిల్లిపల్లి గ్రామ శివారులోని భిక్షపతి అనే వ్యక్తి పొలంలో కట్టేసి ఉన్న ఆవు దూడను చంపి తినేసింది. అలాగే మరో దూడపై దాడి చేసి గాయపరిచింది. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.