అరేయ్ అది పులిరా..పిల్లి కాదు.. ఇది వెజిటేరియనా...అట్లా ఆడుకుంటున్నా ఏం అనడం లేదు

అరేయ్ అది పులిరా..పిల్లి కాదు.. ఇది వెజిటేరియనా...అట్లా ఆడుకుంటున్నా ఏం అనడం లేదు

పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో.. చూస్కో .  పులితో ఫోటో దిగాలి అనిపించింది అనుకో  కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు.  సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది.  ఈ డైలాగ్ గుర్తుందా..యమదొంగలో జూ. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. అయితే ఇక్కడ కనిపిస్తున్న పులి మాత్రం ఏం చేయడం లేదు. దానితో ఆడుకున్నా..ఆట పట్టించినా.. వేధించినా..గప్ చుప్ గా ఉంటోంది. కారణం ఏంటంటే..
 
పులిని జూలో చూసినా.. దూరంగా కనిపించినా..వామ్మో అనుకుంటాం. భయంతో వణికిపోతాం. అలాంటిది మధ్యప్రదేశ్ లోని  ఓ వ్యక్తి మాత్రం అడవిలో నుంచి గ్రామంలోకి చొరబడ్డ  పులితో ఆటలు ఆడుకున్నాడు. దాని మీద కూర్చొని భయం లేకుండా స్వారీ చేస్తున్నాడు.  అసలు అతను అది పులి అనుకుంటున్నాడా..లేక పిల్లి అనుకుంటున్నాడో అర్థం కావడం లేదు.

మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవుల్లో ఓ పెద్దపులి సంచరించింది. ఈ సమాచారంతో ఆ గ్రామస్తులు కొన్ని రోజులుగా ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఓ రోజు ఆ పెద్దపులి ఏకంగా గ్రామంలోకి చొరబడింది. అయితే పెద్దపులిని చూసిన కొందరు భయంతో ఇండ్లలోనే ఉండిపోయారు. మరికొందరు అయితే పెద్దపులి వాలకం చూసి అది అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు రిస్క్ తీసుకుని దానితో సెల్ఫీలు దిగారు.  ఈ సమయంలోనూ  పులి ఏం చేయకపోవడంతో  గ్రామస్తులు దాన్ని వేధించడం మొదలు పెట్టారు. దానిపై కూర్చోవడం, వీపుపై నిమరడం చేశారు. అయినా పులి ఏం చేయకుండా అలాగే నడుస్తుంది. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ALSO READ :నాసిరకం ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్కు బ్రాండెడ్​ లేబుల్స్.. ఐదుగురు అరెస్ట్

పెద్దపులి గ్రామంలోకి వచ్చిందంటూ కొందరు  అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే  ఉజ్జయిని నుండి అటవీ శాఖ అధికారులు ఇక్లెరాకు చేరుకున్నారు. పెద్దపులిని చికిత్స కోసం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తరలించారు. అనారోగ్యంతో ఉన్న చిరుత దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక్లెరాకు వచ్చిందని..సరిగా నడవలేని పరిస్థితులో ఉందని ఫారెస్ట్ అధికారి జితేంద్ర చౌహాన్ తెలిపారు.  ప్రస్తుతం చిరుతపులి వాన్‌ విహార్‌లో చికిత్స పొందుతుందని.. పూర్తిగా కోలుకున్నాక అడవిలో వదిలిపెడతామని చెప్పారు.