కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు

V6 Velugu Posted on Feb 12, 2021

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లానే ఇక నుంచి అన్ని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియంలోనే పాఠాలు చెప్పాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ముందు డిగ్రీ మొదటి ఏడాదిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బోధన ప్రారంభించాలన్నారు. ఇంటర్‌లోనూ ఇదే విధానం అమలు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్‌, తెలుగు లాంగ్వేజ్ లోనే ఉండాలన్నారు సీఎం జగన్.

Tagged Colleges, Andhra Pradesh, Lessons, English Medium

Latest Videos

Subscribe Now

More News