తల‘రాత’ మారుద్దామని!

తల‘రాత’ మారుద్దామని!

హైదరాబాద్ వెలుగు: ‘సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్​అంటే లక్షల్లో జీతాలు తీస్కుంటరు. ఐదు రోజులు పనిచేసి…వీకెండ్స్​లో లైఫ్​ మస్తు ఎంజాయ్​ చేస్తరు’ అని అనుకుంటరు చాలామంది. కానీ వారిలోనూ సోషల్​సర్వీస్ చేసేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. సొసైటీకి తమవంతు ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాళ్లు చాలామందే ఉంటారు. అందులో ఒకరే ఈ ఫొటోలో కనిపిస్తున్న ​అభిషేక్​సింఘాల్‌. రోజూ ఆఫీసు అయిపోయాక హెచ్‌ఐసీసీకి వెళ్లే రోడ్డు దగ్గర ఫుట్‌పాత్‌లపై పిల్లలను చూసేవాడు.

వాళ్ల పేరెంట్స్​బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటారు. గుడిసెల్లో ఉంటూ ఎంత కష్టపడినా పిల్లల పొట్ట నింపలేని తల్లిదండ్రులు, వాళ్లకు చదువు చెప్పించలేని స్థితిలో ఉన్నారని తెలుసుకున్నాడు. దీంతో ప్రతిరోజూ సాయంత్రం ఇలా అందరినీ ఒక్కచోటికి చేర్చి చదువులు చెబుతున్నాడు.