ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం.. 28న భద్రాచలంలో బహిరంగ సభ

ఆదివాసీల హక్కుల కోసం పోరాడుదాం..  28న భద్రాచలంలో  బహిరంగ సభ
  • మాజీ ఎంపీ, రాజ్​గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు

ఓయూ, వెలుగు: ఆదివాసీల హక్కుల కోసం జేఏసీగా ఏర్పడి పోరాడుదామని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, రాజ్​గోండు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు అన్నారు. ఈ నెల 28న భద్రాచలంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఆదివాసీ 9 తెగల రాష్ట్రస్థాయి మేధోమథనం కార్యక్రమాన్ని ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. సభకు సంబంధించిన పోస్టర్ రిలీజ్​చేశారు. డిసెంబర్ 9 న హైదరాబాద్ లో బహిరంగ సభ, ఆ తర్వాత ఢిల్లీలోనూ సభలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

తెల్లం వెంకట్రావు, తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ఆదివాసీ జాతి కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. లంబాడీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకున్నా మాజీ ఎంపీ సీతారాం నాయక్ తమను దూషిస్తున్నారని ఆరోపించారు. ఆధార్ సొసైటీ రాష్ట్ర నాయకులు గొంది వెంకటరమణ, చుంచు రామకృష్ణ, మోట్ల పాపయ్య, సీతారాములు, తెల్లం వెంకటేశ్వర్లు తదితరులు 
పాల్గొన్నారు.