
అనుభవం, యువరక్తం కలగలిసిన విరాట్ సేనకు వరల్డ్ కప్ లో మెరుగైన అవకాశాలున్నాయని క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పేర్కొన్నా డు. విరాట్ కోహ్లీ, ధోనీ జట్టు ప్రధాన బలమని అభిప్రాయపడ్డాడు. మెగాటోర్నీలో ఇండియా సెమీస్ చేరడం పక్కా అన్న కపిల్.. ఆతర్వాత బాగా ఆడడంతో పాటు కాస్త అదృష్టం కూడా కలిసిరావాల్సి ఉంటుందన్నాడు.
వరల్డ్ కప్ కు ఎంపి కైన 15మంది సభ్యుల జట్టు పై కపిల్ స్పందిస్తూ..‘యువరక్తం ,అనుభవం కలగలిసిన టీమిండియా గొప్పగా ఉంది. ఓవిధంగా టోర్నీలో ఆడుతున్న అన్ని జట్లు కంటే ఇండియా అనుభవశాలి. నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు ,ధోనీ, కోహ్లీ తో జట్టు మంచి కాంబినేషన్ ఉంది. వాళ్లిద్దరిని ఒకరితో మరో కరిని పోల్చలేం.
లీగ్ దశను విరాట్ సేన టాప్ 4నే ముగిస్తుంది. ఆ తర్వా త ముందడగు పడాలంటే జట్టు ప్రదర్శనతో పాటు అదృష్టం కూడాకలిసి రావాలి. ఇంగ్లండ్ , ఆస్ట్రే లియా, ఇండి యా జట్లుటాప్ –3 స్థానంలో ఉంటాయి. ఇండియా టీమ్ నాలుగోస్థానంలో ఎవరైనా బ్యాటింగ్‌కు రావొచ్చు . అది ఆటగాళ్ల మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. హార్దిక్ పాండ్ యాటాలెంట్ ఉన్న ప్లేయర్. అతనిపై ఒత్తిడి పెంచకపోతేమంచిది’ అని కపిల్ దేవ్ అన్నా డు.