మణిపూర్​ ఘటనపై రాష్ట్రపతిని కలుస్తాం: ఇండియా కూటమి

మణిపూర్​ ఘటనపై రాష్ట్రపతిని కలుస్తాం: ఇండియా కూటమి

న్యూఢిల్లీ: మణిపూర్‌‌‌‌ విషయంలో  కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు  ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు 'ఇండియా' (ఇండియన్ నేషనల్ డెవలప్‌‌‌‌మెంట్ ఇన్‌‌‌‌క్లూజివ్ అలయన్స్) కూటమి తరఫున కాంగ్రెస్‌‌‌‌ చీఫ్‌‌‌‌ మల్లికార్జున్‌‌‌‌ ఖర్గే అపాయింట్ మెంట్ కోరారు. అయితే ఆయనకు రాష్ట్రపతి నుంచి ఇంకా అపాయింట్ మెంట్ రాలేదు. 

మణిపూర్‌‌‌‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంటులో ప్రధాని  ప్రకటన చేయాలని..ఉభయ సభల్లోనూ సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. కాగా..  హర్యానాలో నెలకొన్న అల్లర్లపై  మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..21వ శతాబ్దపు ఇండియాలో  మతం పేరిట హింసను సహించేది లేదని అన్నారు. ఇలాంటి విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కాకపోతే రాబోయే తరాలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపారు.