
హైదరాబాద్,వెలుగు : హెచ్ఎండీఏను మరింత ఉన్నత స్థితిని తీసుకెళ్లడానికి ప్రతి ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంఏయూడీ, మెట్రోపాలిటన్ కమిషనర్ దాన కిషోర్ సూచించారు. రాష్ట్రావతరణ సందర్భంగా అమీర్ పేటలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్అథారిటీ(హెచ్ఎండీఏ) ఆఫీసులో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అన్నిచర్యలు సక్రమంగా అమలు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, ప్రధాన అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.