కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ కు లేఖ

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అవకతవకలపై సెంట్రల్ విజిలెన్స్ కు లేఖ

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం పోలీసులను కాపలా పెట్టి మద్యం అమ్మకాలు చేపట్టిందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లిక్కర్ తాగండి అని ప్రజలను ప్రోత్సహిస్తోందన్నారు. తాగుబోతులు ఛీప్ లిక్కర్ తాగే వాళ్ళు భౌతిక దూరం పాటించాలి అంటే పాటిస్తారా? అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తితో మందుతాగేవాళ్లు చనిపోయినా పర్వాలేదు అని ప్రభుత్వం భావిస్తుందా? అని అన్నారు.

ఓవైపు తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు 21వేల కోట్లతో టెండర్లు పిలవడం ఎంతవరకు కరెక్టో చెప్పాలన్నారు భట్టి విక్రమార్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గత పనులతో అదనంగా 8వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. దీనిపై సెట్రల్ విజిలెన్స్ కు లేఖ రాస్తామన్నారు.

తెలంగాణ ఇప్పటికే 3లక్షల 21వేల అప్పుల్లో ఉందన్నారు. ఎలాంటి అప్పులు లేకుండా నాగార్జున సాగర్-శ్రీపాద ఎల్లంపల్లి తో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ కట్టారని తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టుల పై సెంట్రల్ విజిలెన్స్ కి వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జరిగిన అవకతవకలు అన్నింటినీ పై సెంట్రల్ విజిలెన్స్ తో విచారణ జరిపిస్తామన్నారు.

ప్రతిపక్షాలను,మీడియాను తిడితే అసలు విషయాలు బయటకు రావు అని సీఎం కేసీఆర్ ఆలోచనగా చెప్పారు భట్టి విక్రమార్క. వైన్ షాప్స్ తెరవడం ద్వారా డాక్టర్లు, పోలీసులు ఇన్ని రోజులు పడిన శ్రమ అంతా వృధా అయింది కదా అని అన్నారు.