అమెరికాలో కాల్పుల మోత : 11 మంది మృతి, పలువురికి గాయాలు

అమెరికాలో కాల్పుల మోత : 11 మంది మృతి, పలువురికి గాయాలు

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వర్జీనియా స్టేట్ లోని  బీచ్ మున్సిపల్ సెంటర్ లో తుపాకీతో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కాల్పులు జరిపిన వ్యక్తి మున్సిపల్ సెంటర్ లో ఉద్యోగిగా గుర్తించారు. తోటి ఉద్యోగులపైనే ఎందుకు ఫైరింగ్ చేశాడన్నది విచారణ చేస్తున్నారు. కాల్పుల సమాచారం అందగానే వర్జీనియా బీచ్ పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. మున్సిపల్ సెంటర్ ను రౌండప్ చేసి కాల్పులు జరిపిన వ్యక్తిని హతమార్చారు. మరెవరూ అనుమానాస్పద వ్యక్తులు లేరని వర్జీనియా బీచ్ పోలీసులు తెలిపారు.

వర్జీనియా బీచ్ చరిత్రలో ఇదో దుర్దినం అని మేయర్ బాబీ డయర్ చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. FBI సహా పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాయి. దుండగుడు కాల్పులు మొదలవగానే మున్సిపల్ సెంటర్ లోని ఉద్యోగులు తలో దిక్కు పారిపోయారు. మరికొందరు ఆఫీస్ తలుపులు వేసుకుని భయంభయంగా గడిపారు. ఫైరింగ్ జరగడంతో వర్జీనియా బీచ్ లో భద్రత కట్టుదిట్టం చేశారు.