ఎల్​ఐసీ .. ప్రపంచంలోనే బలమైన బీమా బ్రాండ్ 

ఎల్​ఐసీ .. ప్రపంచంలోనే బలమైన బీమా బ్రాండ్ 

న్యూఢిల్లీ:  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ) ప్రపంచవ్యాప్తంగా బలమైన బీమా బ్రాండ్‌‌గా అవతరించిందని  బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రిపోర్టు తెలిపింది. దీని ప్రకారం... ఎల్​ఐసీ  బ్రాండ్ విలువ  9.8 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. దీనితో పాటుగా బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్కోర్ 88.3 ఉంది.  ఎల్​ఐసీ తరువాత స్థానంలో క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్‌‌ నిలిచింది.  

దీని బ్రాండ్ విలువ  4.9 బిలియన్ డాలర్లు ఉంది.  చైనీస్ బీమా బ్రాండ్లు ప్రపంచ ర్యాంకింగ్స్‌‌లో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. చైనా లైఫ్ ఇన్సూరెన్స్, సీపీఐసీ వరుసగా తమ 3వ,  5వ స్థానాలను కాపాడుకున్నాయి. జర్మనీకి చెందిన అలియాంజ్,  ఫ్రాన్స్‌‌కు చెందిన ఆక్సాకు తదుపరి స్థానాలు దక్కాయి.