మహిళల కోసం ఎల్ఐసీ  ఆధార్ శిలా పాలసీ

మహిళల కోసం ఎల్ఐసీ  ఆధార్ శిలా పాలసీ

న్యూఢిల్లీ: భారతదేశంలో పొదుపు కోసం ఎక్కువ మంది ఎల్ఐసీవైపు చూస్తారు.  మంచి రాబడిని అందించే సురక్షిత పాలసీలను ఇది లాంచ్ చేస్తుంది. ఎల్ఐసీ ఆధార్ శిలా పేరుతో మహిళల కోసం పాలసీ తెచ్చింది. ఈ పాలసీలో మహిళలు తక్కువ పెట్టుబడితో లక్షల రూపాయలను పొందవచ్చు. ఆధార్ ఐడీలు కలిగిన మహిళలు ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీలో ప్రవేశానికి కనీస వయస్సు 8 సంవత్సరాలు. గరిష్టంగా వయస్సు 55 సంవత్సరాలు. ఆకర్షణీయ రాబడితో పాటు ఇతర లాభాలు ఈ  పాలసీ ప్రత్యేకత.   ఒక మహిళా పెట్టుబడిదారు కనీసం రూ. 75 వేల నుంచి  గరిష్టంగా రూ. 3 లక్షల బీమాను పొందవచ్చు.  క్వార్టర్ లేదా ఆర్నెళ్లు లేదా ఏడాది ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. కనీసం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉదాహరణకు రూ. 3 లక్షల 97 వేలు పొందడానికి సంవత్సరానికి రూ. 10,959 లేదా నెలకు దాదాపు రూ. 899 చొప్పున 20 ఏళ్లపాటు పెట్టుబడి చెల్లించాలి. అంటే మీరు దాదాపు రూ. 2 లక్షల 14 వేలు ప్రీమియంగా చెల్లిస్తారు.  మిగిలినవి మెచ్యూరిటీ సమయంలో మీరు పొందే వడ్డీ అవుతుంది.