న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో రూ.10,987 నికరలాభం సాధించింది. నికర ప్రీమియం ఆదాయం కూడా ఐదు శాతం పెరిగి రూ.1.19 లక్షల కోట్లకు చేరింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయంలో 63.51శాతం వాటాతో ఎల్ఐసీ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
వ్యక్తిగత పాలసీల అమ్మకాలు 14.75శాతం తగ్గినప్పటికీ, వ్యక్తిగత, గ్రూప్ వ్యాపారాల నుండి వచ్చిన ప్రీమియం ఆదాయం పెరిగింది. నిర్వహణలోని ఆస్తులు విలువ 6శాతం పెరిగి రూ.57.05 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ క్వార్టర్లో 1.99 లక్షల మంది మహిళా బీమా సఖీలను నియమించారు. వీళ్లు జూన్ క్వార్టర్ లో 3.26 లక్షల పాలసీలను అమ్మారని ఎల్ఐసీ తెలిపింది.
