న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ నికర లాభం జూన్ 2024 క్వార్టర్లో 10 శాతం పెరిగి రూ. 10,461 కోట్లకు చేరుకుంది. ఈ జీవిత బీమా సంస్థ గత ఏడాది ఇదే కాలంలో రూ.9,544 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.1,88,749 కోట్ల నుంచి రూ.2,10,910 కోట్లకు పెరిగిందని ఎల్‌ఐసీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం రూ. 6,811 కోట్ల నుంచి రూ.7,470 కోట్లకు పెరిగింది.
బీమా సంస్థ రెన్యువల్ ప్రీమియంల ద్వారా రూ. 56,429 కోట్లు ఆర్జించింది. ఏడాది క్రితం రూ. 53,638 కోట్లు వచ్చాయి. పెట్టుబడుల ద్వారా నికర ఆదాయం రూ.96,183 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ కాలంలో రూ.90,309 కోట్లు వచ్చాయి. క్రితం ఏడాది జూన్ క్వార్టర్లో 1.89 శాతంగా ఉన్న ఎల్‌ఐసీ సాల్వెన్సీ మార్జిన్ ఈసారి1.99 శాతానికి పెరిగింది.