ఎల్​ఐసీ లాభం సగమైంది.. ​క్యూ 2 లాభం రూ. 7,925 కోట్లు

ఎల్​ఐసీ లాభం సగమైంది.. ​క్యూ 2 లాభం రూ. 7,925 కోట్లు
  • నెట్​ ప్రీమియం ఇన్​కం రూ. 1.07 లక్షల కోట్లు

ముంబై: లైఫ్​  ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) లాభం సెప్టెంబర్​ 2023 క్వార్టర్లో  సగానికి తగ్గిపోయింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఎల్​ఐసీ లాభం రూ. 15,952 కోట్లు, కాగా తాజా రెండో  క్వార్టర్లో ఇది రూ. 7,925 కోట్లకు పడిపోయింది. సెప్టెంబర్​ 2022 లో అకౌంటింగ్​ పాలసీలో మార్పులు చేశామని, అందువల్ల ఇయర్​ ఆన్​ ఇయర్​ కంపారిజన్​ సరైనది కాదని ఎల్​ఐసీ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది. తాజా సెప్టెంబర్​ క్వార్టర్లో ఎల్​ఐసీ ప్రీమియం ఇన్​కం కూడా 19 శాతం తగ్గి రూ. 1.07 లక్షల కోట్లకు చేరింది.

అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఈ ప్రీమియం ఇన్​కం రూ. 1.32 లక్షల కోట్లు. గ్రాస్​ ఎన్​పీఏ సెప్టెంబర్​ 2022 క్వార్టర్లోని 5.6 శాతం నుంచి ఈ సెప్టెంబర్ క్వార్టర్లో 2.43 శాతానికి తగ్గాయి. నెట్​ఎన్​పీఏలలో ఎలాంటి మార్పూ లేదని ఎల్​ఐసీ ప్రకటించింది. పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం తాజా క్యూ2 లో రూ. 93,942 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. రిజల్ట్స్​ ప్రకటన నేపథ్యంలో ఎల్​ఐసీ షేరు బీఎస్​ఈలో శుక్రవారం 0.68 శాతం తగ్గి రూ. 610.55 వద్ద క్లోజయ్యింది.