
హైదరాబాద్: అబద్ధాలు, మోసాలు అనేవి కాంగ్రెస్ డీఎన్ఏలోనే లేవు అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ క్యాడర్ సమస్యలను పరిష్కారించే దిశగా కృషిచేస్తామన్నారు. ప్రజా పాలనలో పాల్గొనేందుకు ఇందిరాభవన్ఖు వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలకు మరింత దగ్గర అయ్యేందుకు ఇది అద్భుతమైన కార్యక్రమం అని తెలిపారు.
ALSO READ | కార్పొరేషన్ ఏర్పడ్డాక సర్కారు పైసలియ్యలే.. వెలుగులోకి కీలక అంశాలు