హైదరాబాద్ సిటీ, వెలుగు: తనకు ప్రాణహాని ఉందని బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ అనుచరులు, బీఆర్ఎస్ లీడర్లతో ప్రాణహాని ఉందన్నారు. బోరబండ డివిజన్లో తనపై కుట్ర పన్నుతున్నారని భద్రత కల్పించాలని డీజీపీ, ఇంటెలిజెంట్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత తనను చంపుతామని ఉత్తరాలు పంపారన్నారు.
