ఓ మై గాడ్.. హైదరాబాద్లో అపార్ట్మెంట్పై పిడుగు పడింది !

ఓ మై గాడ్.. హైదరాబాద్లో అపార్ట్మెంట్పై పిడుగు పడింది !

హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఉరుములు, మెరుపులు బెంబేలెత్తిస్తున్నాయి. నిజాంపేట మధురానగర్లో అపార్ట్మెంట్పై పిడుగు పడి లిఫ్ట్ డోర్, గోడ ధ్వంసం అయిన ఘటన కలకలం రేపింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్పై పిడుగుపడి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. పంజాగుట్టలో కూడా పిడుగు పడింది. సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ దగ్గర్లో పిడుగు పడి కారు ధ్వంసమైంది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షాలు కొందరి జీవితంలో ఊహించని విషాదాన్ని నింపుతున్నాయి.

వర్షం వస్తుందని.. ఫ్లై ఓవర్ కింద ఉన్న ఓ యువతిని.. స్కూల్ బస్సు ఢీకొన్న ఘటన హైదరాబాద్ సిటీలో జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చావు బతుకుల మధ్య ఆ యువతి పోరాడుతుంది. 2024,  ఆగస్ట్ 20వ తేదీ జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ రాజేంద్రనగర్ అత్తాపూర్లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 130 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్తాపూర్కు చెందిన హారిక అనే యువతి ఆఫీసుకు వెళ్లటానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడుతుంది. దీంతో తడవకుండా ఉండేందుకు ఫ్లై ఓవర్ కింద నిల్చుంది. సరిగ్గా ఈ సమయంలోనే అటుగా వస్తున్న స్కూల్ బస్సు.. హారికను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హారిక కొద్ది దూరం ఎగిరి పడింది. ప్రమాదం తర్వాత హారికను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. హారిక ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.