ఎయిర్​ఫోర్స్​కు తొలి ట్విన్​ సీటర్​ తేజస్

ఎయిర్​ఫోర్స్​కు తొలి ట్విన్​ సీటర్​ తేజస్

బెంగళూరు: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేలికపాటి యుద్ధ విమానం(ఎల్​సీఏ) తొలి ట్విన్ ​సీటర్​ తేజస్​ యుద్ధ విమానంను హిందూస్థాన్​ ఏరోనాటికల్​ లిమిటెడ్(హల్) ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు బుధవారం అందజేసింది. 

బెంగళూరులోని హల్ ​హెడ్ ​ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్​ భట్, ఎయిర్​ చీఫ్ ​మార్షల్ ​వీర్ ​చౌధరి పాల్గొన్నారు. ఎయిర్​ఫోర్స్​ శిక్షణ అవసరాలకు అనుగుణంగా దీన్ని ట్విన్​ సీటర్స్​గా డెవలప్ ​చేశామని, ఎమర్జెన్సీలో ఇది పూర్తిస్థాయి యుద్ధ విమానంగా పనిచేస్తుందని హల్ ​తెలిపింది. 

ఆత్మనిర్భర్ ​భారత్​లో భాగంగా హల్​ దశల వారీగా మొత్తం18 ట్విన్ ​సీటర్ ​తేజస్​యుద్ధ విమానాలను తయారు చేయనుంది.