రెండ్రోజులు తేలికపాటి వానలు

రెండ్రోజులు తేలికపాటి వానలు

 గ్రేటర్​లో రెండ్రోజులపాటు తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడొచ్చన్నారు. సోమవారం సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వాన కురిసింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 10.3 మి.మీ., చందానగర్ లో 8.8, పఠాన్ చెరులో 5.8 మి.మీ. వాన పడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం ఉపశమనం పొందారు.