మరో 4 రోజులు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ

మరో 4 రోజులు వానలు.. ఎల్లో అలర్ట్ జారీ
  • వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వానలు  పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వానలు పడతాయని ప్రకటించింది. 3, 4 తేదీల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించింది. ఆగస్టు 4వ తేదీ వరకు రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని తెలిపింది. 3న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ , జనగామతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్​ ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.