హైదరాబాద్ గచ్చిబౌలిలో పిడుగు పడింది.. వీడియో ఇదే..!

హైదరాబాద్ గచ్చిబౌలిలో పిడుగు పడింది.. వీడియో ఇదే..!

హైదరాబాద్: సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలతో గచ్చిబౌలిలో పిడుగు పడింది. దీంతో స్థానికంగా ఉన్న జనాలు పరుగులు తీశారు. గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా పిడుగు పడటంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రాష్ట్రంలో ఆగస్టు నెలలో సాధారణం కంటే ఎక్కువగా వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు చెప్పింంది. అదే విధంగా ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ జిల్లాల్లో భారీ వర్గాలు కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు కురుస్తాయని చెప్పింది.

అన్ని జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి తూర్పు ఈశాన్య దిశలో అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇక ఉపరితల చక్రవాహక ఆవర్తనం ఒకటి నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద సగటు సముద్ర ముట్టం నుంచి 3.1 నుండి 5.8 కిమీ మధ్యలో కొనసాగుతోందని పేర్కొంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12శాతం మేర తక్కువ వర్షం సమోదైంది.