
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ ఆయా బాధ్యతల్లో యథావిధిగా కొనసాగుతారని సర్కారు ప్రకటించింది. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి జీవో నంబర్ 96 రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ సర్కారు నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను తొలగిస్తూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు గతనెలలో ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, దీంట్లో పొలిటికల్ కు సంబంధం లేని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లూ కూడా ఉన్నాయి. మరోపక్క తొలగిస్తూ ఇచ్చిన జీవో రిఫరెన్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులకు సంబంధం లేకుండాఉండటంతో, కొంత అయోమయం నెలకొన్నది. దీనిపై స్పష్టత ఇవ్వాలని వారు సర్కారు పెద్దలను కోరగా, అదే పోస్టుల్లో కొనసాగాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో అధికారికంగా కొనసాగిస్తున్నట్టు గురువారం జీవో రిలీజ్ చేశారు.