తాండూర్, వెలుగు: వికారాబాద్జిల్లా తాండూరుకు చెందిన జానపద నృత్య కళాకారుడు అశోక్ సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. అశోక్చిన్నతనం నుంచే జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తన ప్రదర్శనలతో లిమ్కా బుక్ ఆఫ్రికార్డ్సులోనూ స్థానం సంపాదించుకున్నారు. తాండూర్లో ఫైన్ఆర్ట్కల్చర్అకాడమీ ప్థాపించి ఎందరో కళాకారులను తయారు చేశారు. జానపద వేషధారణలో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో తొమ్మిది అవార్డులు అందుకున్నారు. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
