
గుండాల మండలంలోని లింగగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్న వానకే కురుస్తోంది. ఈ స్కూల్లో 33 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాలుగు గదులు ఉన్నప్పటికీ రెండు గదులను గ్రామ పంచాయతీకి అప్పజెప్పారు. ఉన్న రెండు గదులు ఇటీవల కురుస్తున్న వర్షాలకు పైనుంచి నీళ్ల చుక్కలు పడుతున్నాయి.
స్లాబ్ పెచ్చులూ రాలి పడుతున్నాయి. గోడలన్నీ తడితో నిమ్ముగా ఉండడం, అక్కడే విద్యత్ మీటర్ బిగించి ఉండడంతో పిల్లలను బడికి పంపించేందుకు పేరెంట్స్ భయపడుతున్నారు. ఒకవైపు కురుస్తున్న చోట బకెట్లను పెట్టి, మరో పక్క విద్యార్థులు కూచోని పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూల్ ఇలా అయితే చదువుకునేదెలా అని స్టూడెంట్స్, వారి పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే స్కూల్కు రిపేర్లు చేయించాలని కోరుతున్నారు. - గుండాల, వెలుగు