లింగంపేట,వెలుగు: గాంధారి మండలం హేమ్లానాయక్ తండాలో కాంసోత్ మోహన్ కు చెందిన ఆరు మేకలు దొంగతనానికి గురైనట్లు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.మోహన్14 మేకలను మంగళ వారం రాత్రి ఇంటి పక్కన గల కొట్టంలో ఉంచాడు.
బుదవారం ఉదయం లేచి చూడగా ఆరు మేకలు కన్పించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తండాకు వెళ్లి మేకలు దొంగిలించబడ్డ కొట్టంను పరిశీలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లుతెలిపారు.
