లింగాయత్ లను ఓబీసీ జాబితాలో చేర్చాలి : ఆర్. కృష్ణయ్య

లింగాయత్ లను ఓబీసీ జాబితాలో చేర్చాలి :  ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం దశాబ్ది ఉత్సవాల్లో ఆర్. కృష్ణయ్య, ప్రొఫెసర్ కోదండరామ్, ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎంపీ సురేశ్​షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, కాంగ్రెస్ సర్కార్ వచ్చే ఏడాది వరకైనా వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, బడ్జెట్ కేటాయించాలని కోరారు. సమాజంలో అందరూ  ఒక్కటే అని ప్రబోధించిన మహనీయుడు బసవేశ్వరుడి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు. అనంతరం  సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటోళ్ల సంగమేశ్వర్ , గౌరవ అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్పలతో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం చేయించి, సంఘం డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రఘు , మణికంఠ , రాచప్ప, చిప్ప గిరిబాబు పాల్గొన్నారు.

దివ్యాంగుల శాఖపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..

రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం ప్రత్యేక శాఖ తోనే అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ప్రొ. కోదండరాం అన్నారు.  మంత్రి  సీతక్కను త్వరలో కలిసి వివరిస్తానని తెలిపారు. ఎస్ వీకేలో   వికలాంగుల అభివృద్ధి..   అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రొ. కోదండరాం హాజరై మాట్లాడారు.