యువత ఓటు హక్కు నమోదుచేసుకోవాలి

యువత ఓటు హక్కు నమోదుచేసుకోవాలి
  • ప్రైవసీ విషయంలో ఇబ్బందులుండవు
  • యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
  • ‘వెలుగు’తో సీఈవో శశాంక్​గోయల్​

హైదరాబాద్, వెలుగు: ఓటరు ఐడీకి ఆధార్ నెంబర్​ను లింక్​ చేస్తే ఖచ్చితంగా బోగస్​ ఓట్లకు చెక్​ పడుతుందని సీఈవో శశాంక్​ గోయల్​స్పష్టం చేశారు. ఎలక్షన్​ కమిషన్​ బోగస్​ ఓట్ల ఏరివేతకు ప్రత్యేక సాఫ్ట్​వేర్లు ఉపయోగిస్తున్నప్పటికీ కొన్ని అలాగే ఉంటున్నాయన్నారు. ఆధార్​తో లింక్​ చేస్తే దేశవ్యాప్తంగా ఎవరికీ రెండు ఓటరు గుర్తింపు కార్డులు ఉండవని, నకిలీ​ ఓట్లను ఏరివేయడం ఈజీ అవుతుందన్నారు. ఎలక్షన్ల విషయంలో ఆఫీసర్లుగా తాము అన్ని పార్టీల లీడర్లతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉంటామని తెలిపారు. పీఎంవో ఆఫీసర్లతో ఎలక్షన్​ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనడం సాధారణంగా జరిగిన ప్రక్రియగానే  ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ఈజీ టాస్క్​కాదని తెలిపారు. ఓటరు కార్డు–ఆధార్​లింక్ పై సీఈవో శశాంక్​గోయల్​బుధవారం ‘వెలుగు’తో మాట్లాడారు. 

ఆధార్​ నెంబర్​ లింక్​ చేయడం తప్పనిసరా?
పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందింది. దీని మీద మాకు ఇంకా గైడ్​లైన్స్ ​రాలేదు. ఆధార్​నెంబర్​యూనిక్​గా ఉండటంతో చాలా వాటికి దాన్ని అనుసంధానం చేస్తున్నరు. ఓటరు కార్డుకు లింక్​ చేయడం మంచి విషయం. దీని వల్ల పూర్తి స్థాయిలో బోగస్​ఓట్లకు చెక్​పెట్టొచ్చు. అయితే ఇది తప్పనిసరిగానా..? ఆప్షనలా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. బోగస్​ ఓట్ల ఏరివేతకు రెండు రకాల సాఫ్ట్​వేర్లు వాడుతున్నం. అదీ రాష్ట్రానికే పరిమితం. కొందరు ఇతర రాష్ట్రాల్లో ఓటరు ఐడీ ఉండి.. ఇక్కడ తీసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. ఆధార్​ నెంబర్ ​లింక్​ చేస్తే ఇలాంటి వాటన్నింటికీ చెక్ ​పెట్టొచ్చు. గతంలో ఇలాంటి ప్రక్రియ ఒకటి జరిగింది. అప్పుడు చాలా ఓట్లు తొలగించడంతో అభ్యంతరాలు వచ్చాయి. అయితే నిజమైన ఓటరుకు నష్టం జరగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది.  ప్రైవసీ విషయంలో ఇబ్బంది ఉండదు. 

జమిలి ఎన్నికలపై సీఈసీ ఏమైనా సంప్రదింపులు జరుపుతోందా?
జమిలి ఎన్నికలు అంత ఈజీ టాస్క్​ కాదనేది నా అభిప్రాయం. దీనిపై ఎలక్షన్​ కమిషన్ ​నుంచి ఇప్పటి దాకా మాకు ఎలాంటి సమాచారం రాలేదు. చట్టంలో సవరణలు చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్​ఎలక్షన్స్​కు దాదాపు ఇంకా రెండున్నరేండ్ల  టైమ్ ఉంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్స్​అయిపోయాయి. కొన్నింటికి త్వరలో ఉన్నాయి. తెలంగాణ వరకు వస్తే ఇంకా రెండు సంవత్సరాలు టైం ఉంది. జమిలి ఎలా అనేది మా వరకు ఇంకా రాలేదు. ఈసీ ఏమైనా చెబితే దాని ప్రకారం ముందుకు వెళ్తాం. ఈవీఎంలు, వీవీప్యాట్లు ఇతర ఎన్నికల సామగ్రి విషయంలో మాత్రం పర్ ఫెక్ట్​గా ఉన్నం. జిల్లాల్లో ఈవీఎంల స్టోరేజ్​కు గోడౌన్లు పూర్తి చేశాం.